Suckker Fish : తినటానికి పనికిరాదు కానీ…పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది… వింత చేపతో తంట…

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన వింత చేప కనిపించింది. పశ్చిమ బంగ్లా నుంచి ఫిష్ సీడ్​లో ఆంధ్రకు తరలివచ్చిన తెలుపు, నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల వలకు చిక్కాయి.

Suckker Fish : తినటానికి పనికిరాదు కానీ…పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది… వింత చేపతో తంట…

Suckker Fish

Updated On : April 15, 2021 / 8:44 AM IST

Suckker Fish in East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన వింత చేప కనిపించింది. పశ్చిమ బంగ్లా నుంచి ఫిష్ సీడ్​లో ఆంధ్రకు తరలివచ్చిన తెలుపు, నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల వలకు చిక్కాయి. వీటిని సక్కర్ ఫిష్ అంటారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పి.గన్నవరం మండలం మానేపల్లిలోని పంట కాల్వలో ఈ తెలుపు నలుపు చారలు కలిగిన చేపలు కనిపించాయి.

పశ్చిమ బంగ్లాకు దగ్గరగా ఉండే ఈ రకం చేపలు, కోల్​కతా నుంచి ఆక్వా సీడ్​లో కలిసిపోయి ఆంధ్రాకి వచ్చాయని వివరించారు. ఈ చేపలు చెరువుల్లో చేరితే ఆక్వా రైతులకు భారీ నష్టం కలుగుతుందని చెప్పారు. ఇలాంటి వింత చేప సముద్రం, కాలువలో కూడా అరుదుగా ఉంటాయని తెలిపారు. ఇది సుమారు 50 అంగుళాలు పొడవు కలిగి ఉంటుంది.

ఇది ఇతర చేపల్లాంటిది కాదు, ఇది మాంసం తినే చేప. అంటే తన తోటి చేపల్ని, జీవుల్నీ, చివరకు మనుషుల మాంసాన్ని కూడా తింటుందట. ఇదో రకమైన క్యాట్‌ఫిష్ జాతి చేప. దీన్ని నదులు, చెరువుల్లో కనిపిస్తే చంపేస్తారు. ఎందుకంటే ఇది చుట్టుపక్కల పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఇది మనుషులు తినడానికి కూడా ఉపయోగపడదు.