పోలవరం ఫైల్స్ దహనం కేసు.. ఆ నలుగురిపై వేటు

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

పోలవరం ఫైల్స్ దహనం కేసు.. ఆ నలుగురిపై వేటు

Updated On : August 18, 2024 / 11:45 PM IST

Polavaram Files Burnt Case : పోలవరం ఫైల్స్ దహనం కేసులో అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం కుడి, ఎడమ కాలువ కార్యాలయం ఫైళ్ల దహనం కేసులో సీనియర్ అసిస్టెంట్ నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీసర్ సబార్డినేట్ రాజశేఖర్ పైన సస్పెన్షన్ వేటు వేశారు. డిప్యూటీ తహశీల్దార్ కుమారి, సత్యదేవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Also Read : టీడీపీ సీనియర్లు, నాగబాబుకు కీలక పదవులు..! నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం..