Simhadri Appanna : సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా సభ్యులు

సింహాద్రి గర్భగుడిలో టీమిండియా జట్టు ఆటగాళ్లు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. కప్పస్తంభం..ఆలింగనం వద్ద వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు.

Simhadri Appanna : సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా సభ్యులు

Team India Players Simhachalam

Updated On : November 23, 2023 / 12:00 PM IST

Simhadri Appanna – T20 Team India : సింహాచలం సింహాద్రి అప్పన్నను గురువారం టీ20 టీమిండియా సభ్యులు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ తదితరులకు ఆలయ ఈవో ఘనంగా ఆహ్వానం పలికారు. సింహాద్రి గర్భగుడిలో టీమిండియా జట్టు ఆటగాళ్లు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. కప్పస్తంభం.. ఆలింగనం వద్ద వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. నేడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టీమిండియా గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు.

Team India, Simhachalam

Team India Players in Simhachalam

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 23 గురువారం విశాఖపట్నంలో జరుగనుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈజోజు రాత్రి సమయం 7 గంటలకు ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతను అప్పగించారు.

India vs Australia : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. ఎప్పుడు? ఎక్కడ?

భారత జట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా షెడ్యూల్
నవంబర్ 23, గురువారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 1వ టీ20 మ్యాచ్ – 7పీఎం
నవంబర్ 26, ఆదివారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 2వ టీ20 మ్యాచ్ – 7పీఎం
నవంబర్ 28, మంగళవారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టీ20 మ్యాచ్ – 7పీఎం
డిసెంబర్ 1, శుక్రవారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 4వ టీ20 మ్యాచ్ – 7పీఎం
డిసెంబర్ 3, ఆదివారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5వ టీ20 మ్యాచ్ – 7పీఎం