India vs Australia : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. ఎప్పుడు? ఎక్కడ?

ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో భారీ మార్పులు జరిగాయి. గత నెలన్నరగా ప్రపంచ కప్‌లో ఆడిన చాలా మంది సీనియర్ ఆటగాళ్లు టీ20లో పాల్గొనడం లేదు.

India vs Australia : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. ఎప్పుడు? ఎక్కడ?

India vs Australia T20 Series

India vs Australia T20 Series : ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగనుంది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత భారత్ మొదటి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 23 గురువారం విశాఖపట్నంలో జరుగనుంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆస్ట్రేలియా జట్లు విజయం సాధించి కప్ ను సొంతం చేసుకుంది.

ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో భారీ మార్పులు జరిగాయి. గత నెలన్నరగా ప్రపంచ కప్‌లో ఆడిన చాలా మంది సీనియర్ ఆటగాళ్లు టీ20లో పాల్గొనడం లేదు. పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ గైర్హాజరు కావడంతో అనుభవజ్ఞుడైన మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్సీ చేపట్టారు. సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతను అప్పగించారు.

Mysterious Pneumonia : చైనాలో మిస్టరీగా మారిన మరో మహమ్మారి…న్యుమోనియా…ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

వచ్చే ఏడాది మధ్యలో కరేబియన్ దీవులు, యునైటెడ్ స్టేట్స్‌లో టీ20 ప్రపంచ కప్‌కు జరుగనుంది. కాబట్టి సిరీస్ ద్వారా ఇరు జట్లు తలపడటం ఆసక్తికరంగా ఉంటుంది. టీ20 సరిస్ ఐదు మ్యాచ్ లను ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ 18 ద్వారా ప్రసారం చేయబడుతుంది. అలాగే జియో సినిమా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా షెడ్యూల్
నవంబర్ 23, గురువారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 1వ టీ20 మ్యాచ్ – 7పీఎం
నవంబర్ 26, ఆదివారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 2వ టీ20 మ్యాచ్ – 7పీఎం
నవంబర్ 28, మంగళవారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3వ టీ20 మ్యాచ్ – 7పీఎం
డిసెంబర్ 1, శుక్రవారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 4వ టీ20 మ్యాచ్ – 7పీఎం
డిసెంబర్ 3, ఆదివారం: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5వ టీ20 మ్యాచ్ – 7పీఎం

మొదటి టీ20 మ్యాచ్
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి సమయం 7 గంటలకు ప్రారంభం కానుంది.

Uttarkashi tunnel rescue : చివరి దశకు చేరుకున్న ఉత్తరకాశి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌…41 మంది కార్మికులు మరికొద్దిసేపట్లో బయటకు…

భారత జట్టు
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ.

ఆస్ట్రేలియా జట్టు
ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్/కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్, ఆరన్ హార్డీన్.