టీడీపీలో అసంతృప్త జ్వాలలు.. గంటా రహస్య భేటీ.. గండి బాబ్జి రాజీనామా

రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అలర్టయ్యారు. అనుచరులతో సీక్రెట్‌గా మంతనాలు జరుపుతున్నారు.

టీడీపీలో అసంతృప్త జ్వాలలు.. గంటా రహస్య భేటీ.. గండి బాబ్జి రాజీనామా

TDP 2nd List: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించడంతో విశాఖ జిల్లాలో టీడీపీలో అసంతృప్త జ్వాలలు ఎగశాయి. తమకు సీట్లు దక్కకపోవడంతో పలువురు సీనియర్ నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అలర్టయ్యారు. అనుచరులతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. కాగా, భీమిలి సీటు కోసం గంటా పట్టుబడుతుండగా.. చంద్రబాబు మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు.

టీడీపీకి గండి బాబ్జి గుడ్‌బై
విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గండి బాబ్జి.. టీడీపీకి రాజీనామా చేశారు. విశాఖ సౌత్ స్థానాన్ని జనసేన అభ్యర్థి వంశీ యాదవ్‌కి కేటాయించడంతో మనస్థాపం చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ వెస్ట్ స్థానం ఆశించిన పాసర్ల ప్రసాద్ కూడా కొన్ని రోజుల క్రితం తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు. యలమంచిలి సీటు సుందరపు విజయ్ కుమార్‌కు కేటాయించడంతో ప్రగడ నాగేశ్వరరావు అలిగారు.

Also Read: 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో లిస్ట్ విడుదల.. సీనియర్లకు మరోసారి నిరాశ

బండారు వర్గీయుల ఆందోళన
పెందుర్తి సీటు పంచకర్లకు కేటాయించారని ప్రచారం రావడంతో బండారు సత్యనారాయణ వర్గీయులు ఆందోళనకు దిగారు. పాడేరు సీటు బిజెపి ఉమామహేశ్వరావుకు కేటాయించారని వదంతులు రావడంతో పాడేరు టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇంటి వద్ద ఆమె మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.