Chandrababu : సీఎం పదవి నుంచి జగన్ తప్పుకోవాలి : చంద్రబాబు

సినీ పరిశ్రమపై జగన్ కక్ష కట్టారని నిన్న సినిమా వాళ్లు మాట్లాడిన మాటలతో అర్థమైందన్నారు. సమస్యా తానే, పరిష్కారమూ తానే., ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. ఇలా కూడా చేయొచ్చని ఊహించలేదన్నారు.

Chandrababu : సీఎం పదవి నుంచి జగన్ తప్పుకోవాలి : చంద్రబాబు

Chandrababu

Updated On : February 11, 2022 / 4:58 PM IST

Chandrababu fired at CM Jagan : సీఎం పదవి నుంచి జగన్ తప్పుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అన్నీ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన అసమర్థుడైన జగన్.. సీఎంగా తప్పుకుంటే రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుందన్నారు. సినీ పరిశ్రమలో తానే సమస్య సృష్టించి మళ్లీ తానే పరిష్కరిస్తున్నట్లు వ్యవహరించారని మండిపడ్డారు.

సినీ పరిశ్రమపై జగన్ కక్ష కట్టారని నిన్న సినిమా వాళ్లు మాట్లాడిన మాటలతో అర్థమైందన్నారు. సమస్యా తానే, పరిష్కారమూ తానే…., ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా…, ఇలా కూడా చేయొచ్చని ఊహించలేదన్నారు. వివిధ వర్గాల పొట్ట కొట్టి ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Manchu Vishnu : మోహన్‌బాబు-మంత్రి పేర్ని నాని భేటీపై ట్వీట్‌ ను ఎడిట్ చేసిన మంచు విష్ణు

బరి తెగించిన నేరగాళ్లు ఉగ్రవాదులను మించి వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నేరగాళ్లు రాజ్యమేలితే రాష్ట్రం ఇలానే ఉంటుందన్నారు. 2019 వరకు జీవన ప్రమాణాలు ఏంటి…నేడు ఏంటి అనేది ప్రజలు బేరీజు వేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు.