Chandrababu : తెలుగు నేలకు జలహారం పేరుతో.. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన

రాయలసీమలో సిరులు పండాలంటే ఆ ప్రాంతానికి ఇప్పటివరకు ఎవరూ చేయని ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డి పోవాల్సిందే అంటూ నినాదంతోపాటు ఈ పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

Chandrababu : తెలుగు నేలకు జలహారం పేరుతో.. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన

Chandrababu visit projects

Chandrababu Visit Projects : టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం నుంచి ఏపీ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ క్షేత్రస్థాయిలో వాటి స్థితి గతులను ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. తెలుగు నేలకు జలహారం పేరిట పెన్నా నుంచి వంశధార వరకు 10 రోజుల వరకు పది రోజులపాటు ప్రాజెక్టుల సందర్శన చేయనున్నారు.

ఇవాళ మంగళవారం మచ్చుమర్రి నుంచి యాత్ర ప్రారంభించనున్న చంద్రబాబు రేపు (బుధవారం) పులివెందులలో రోడ్ షో, భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జల వనరుల ప్రాజెక్టుల స్థితి గతులపై మూడు రోజులపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు ప్రజా క్షేత్రంలోనే ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు సైతం సిద్ధమయ్యారు.

Janasena : వాలంటీర్ చేసిన హత్యకు బాధ్యత ఎవరు తీసుకుంటారు జగన్? ముఖ్యమంత్రిని నిలదీసిన పవన్ కల్యాణ్

రాయలసీమలో సిరులు పండాలంటే ఆ ప్రాంతానికి ఇప్పటివరకు ఎవరూ చేయని ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డి పోవాల్సిందే అంటూ నినాదంతోపాటు ఈ పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పర్యటనలో తొలి దశలో భాగంగా పెన్నా నది నుంచి నాగావళికి వరకు వివిధ నదులపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులో రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పరకచర్ల హెడ్ రెగ్యులేటర్ ను సైతం ఆయన సందర్శిస్తారు. బుధవారం జమ్మలమడుగు, పులివెందులలో చంద్రబాబు పర్యటన సాగనుంది. కొండాపురం మండలం గండికోట ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించనున్నారు.

Manchu Manoj : చంద్రబాబుతో మంచు మనోజ్‌ ఫ్యామిలీ..

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు పులివెందుల వెళ్లనున్నారు.  అక్కడ పోలంగల్ల సర్కిల్ వద్ద రోడ్ షో నిర్వహిస్తారు. ఆగస్టు 3న కదిరి, అనంతపురంలో చంద్రబాబు పర్యటన సాగనుంది. పేరూరు ఇరిగేషన్ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్ లను సైతం చంద్రబాబు సందర్శిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో కియా ప్రాజెక్టును కూడా ఆయన సందర్శించనున్నారు.

ఆగస్టు4న చిత్తూరులో పొంగునూరు బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించి రైతులు, స్థానికులతో సమావేశం అవుతారు. ఆగస్టు5న తిరుపతిలో బాలాజీ రిజర్వాయర్ ను సందర్శిస్తారు. ఆ రోజు సాయంత్రానికి నెల్లూరుకు చేరుకుని తిరుపతి, నెల్లూరులో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.