కొడాలి నానికి చెక్ పెట్టేలా చంద్రబాబు వ్యూహం.. లక్ష మందితో గుడివాడలో బలప్రదర్శన
అక్కడి నుంచే నేరుగా చంద్రబాబు గుడివాడ బహిరంగ సభకు వెళ్లనున్నారు. వెనిగండ్ల రామును ఇంఛార్జిగా నియమించిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

TDP Public Meeting In Gudivada
Gudivada : రేపు(జనవరి 18) గుడివాడలో బలప్రదర్శనకు టీడీపీ సిద్ధమైంది. కొడాలి నాని నియోజకవర్గంలో టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. రేపు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో గుడివాడ టీడీపీ ఇంఛార్జి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు హాజరయ్యే ఈ సభ టీడీపీ బలప్రదర్శనగా ఉండనుంది. వెనిగండ్ల రామును ఇంఛార్జిగా నియమించిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లపై రాము ప్రత్యేక దృష్టి పెట్టారు.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..!
రేపు మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ లో చంద్రబాబు, భువనేశ్వరి నిమ్మకూరు వెళ్లనున్నారు. అక్కడే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించనున్నారు. అక్కడి నుంచే నేరుగా చంద్రబాబు గుడివాడ బహిరంగ సభకు వెళ్లనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సభకు లక్ష మందిని జన సమీకరణ చేసేందుకు టీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. గుడివాడ శివారులో భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా గుడివాడలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తగ్గేదేలే అంటున్నారు. కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళ్తారు. అక్కడ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. అనంతరం పీ4 అనే కొత్త ప్రొగ్రాం కూడా లాంచ్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో బహిరంగ సభా వేదికకు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు చంద్రబాబు. ఇటీవలే గుడివాడ టీడీపీ ఇంఛార్జ్ గా వెనిగండ్ల రామును నియమించారు చంద్రబాబు. ఆయన ఒక సవాల్ గా తీసుకున్నారు. మొన్నటివరకు రావి వెంకటేశ్వర రావు, రాము మధ్య గ్రూపు తగాదాలు ఉన్నాయి. దాదాపు ఏడాది పాటు గ్రూపు తగాదాలతో గుడివాడలో టీడీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. రెండు నెలల క్రితమే రామును గుడివాడ ఇంఛార్జ్ గా టీడీపీ ప్రకటించింది. ఆయన కూడా సవాల్ గా తీసుకుని పని చేస్తున్నారు.
Also Read : అధికారం దక్కాలంటే అక్కడ మెజార్టీ సీట్లు గెలవాల్సిందే.. ఇంతకీ ఆ జిల్లా ఏది?
జిల్లాకు చెందిన నేతలంతా దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ లాంటి సీనియర్లు.. రెండు జిల్లాలకు ఇంఛార్జ్ అయిన సత్యనారాయణ రాజు కూడా దగ్గరుండి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. కొడాలి నాని ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ లో కూడా గుడివాడలో పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించింది. అదే స్థాయిలో ఇప్పుడు బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గుడివాడపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొడాలి నాని వరుసగా నాలుగుసార్లు గెలిచిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఆయన ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని టీడీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో తమ బలప్రదర్శనకు వేదికగా గుడివాడను ఎంచుకుంది.