Bhuma Akhila Priya : చంద్రబాబును అరెస్ట్ చేసినచోటే దీక్ష చేస్తాం, అనుమతి ఇవ్వనంటే భయపడినట్లే : భూమా అఖిల ప్రియ

రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన జరుగుతుందని..ఎటువంటి ఆధారాలు లేకుండానే.. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు .జ్యూడిషియల్ క్యాపిటల్ అన్నారు కదా ఏమైంది..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Bhuma Akhila Priya : చంద్రబాబును అరెస్ట్ చేసినచోటే దీక్ష చేస్తాం, అనుమతి ఇవ్వనంటే భయపడినట్లే : భూమా అఖిల ప్రియ

bhuma akhila priya

Updated On : September 21, 2023 / 2:10 PM IST

TDP leader Bhuma Akhila Priya : మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అసెంబ్లీలో చర్చ జరగకూడదని వైసీపీ వ్యవహరిస్తోంది అంటూ మాజీ మంత్రి,టీడీపీ మహిళా నేత అఖిలప్రియా విమర్శించారు.నంద్యాలలో చంద్రబాబు అరెస్టుకు నిసరనగా టీడీపీ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు..  రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన జరుగుతుందని..ఎటువంటి ఆధారాలు లేకుండానే.. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు..జ్యూడిషియల్ క్యాపిటల్ అన్నారు కదా ఏమైంది..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలపై కేసులు పెట్టటానికి ప్రభుత్వం పనిచేస్తోందా..? అంటూ ప్రశ్నించారు.

మంత్రులు చేసేది ఒక్కటే వాళ్లకు తెలిసిందన్నా చంద్ర బాబును తిట్టడమేపని అంటూ ఎద్దేవా చేశారు.కొంత మంది పోలీసులు చంద్రబాబు అరెస్టు చేయటంతో అత్యుత్సాహం చూపారని విమర్శించారు.
మేము శాంతియుతంగా దీక్ష చేసుకుంటామంటే అనుమతి ఇవ్వని పోలీసులు వైసీపీ నేతలు ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయరు అంటూ మండిపడ్డారు. టీడీపీ కార్యక్రమాలకు మీరు అనుమతి ఇవ్వటంలేదు అంటూ మీరు భయపడినట్లే కదా అంటూ ఎద్దేవా చేశారు.

AP Assembly : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

మేము చావడానికైనా సిద్ధం ప్రజలందరూ ఆలోచించుకోవాలని…చంద్రబాబు అరెస్ట్ ఆళ్లగడ్డ కు,నంద్యాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు రాష్ట్రానికి సంబంధించిన విషయం అని అన్నారు.రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుందని విమర్శించారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు కాబట్టి మేం దీక్ష ఇక్కడే చేస్తాం అంటూ అఖిల ప్రియ స్పష్టంచేశారు. ఈ రోజు నుంచే దీక్ష చేపడతామని …పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే SP కార్యాలయం వద్ద దీక్ష చేపడతాం తప్ప దీక్ష మానే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.