కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యం అమ్మిస్తారా?

  • Published By: vamsi ,Published On : December 16, 2019 / 04:48 AM IST
కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యం అమ్మిస్తారా?

Updated On : December 16, 2019 / 4:48 AM IST

ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాలు సాగుతున్నాయి. మద్యపాన నిషేధం అంశంపై తెలుగుదేశం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అసెంబ్లీలో మాట్లాడారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటనే మర్చిపోయారని అన్నారు. మద్యం నియంత్రిస్తున్నట్లు చెబుతూ రేట్లు పెంచుకుని ఆదాయం తెచ్చుకుంటున్నారని ఆమె అన్నారు. షాపులు తగ్గినట్లు చెబుతూ వచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని ఆమె ఆరోపించారు.

రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా రేట్లు బాగా పెంచుకుని లాభాలు పొందుతున్నారని ఆమె అన్నారు. వైసీపీ కార్యకర్తల నుంచి షాపులు అద్దకు తీసుకుని గతంలో ఇచ్చిన రేట్ల కంటే ఎక్కువగా రూ.20వేల నుంచి 50వేల వరకు అద్దెలు పెంచినట్లు ఆమె చెప్పారు. గుళ్లు, బడులు దగ్గర కూడా మద్యం దుకాణాలు పెడుతున్నారని ఆమె అన్నారు. 

ఎక్సైజ్ ఆఫీసర్లు తూతూ మంత్రంగా చెకింగ్ చేస్తున్నారని, అలాగే రాత్రి 8గంటల వరకు మద్యం అమ్మి అక్కడి నుంచి షాపుల వాళ్లే బెల్టులుగా మారిపోయి అమ్ముతున్నారని అన్నారు. మద్యం కొనడానికి వచ్చేవాళ్లు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారని, డిగ్రీ చదువుకునే వాళ్ల చేత మందు అమ్మిస్తున్నారని, వాళ్లకు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పించుకుండా ఇటువంటి పనులు చేయించడం కరెక్ట్ కాదని అన్నారు.

అలాగే ప్రభుత్వానికి కమీషన్ ఎక్కువగా వచ్చే బ్రాండ్స్‌నే పెడుతున్నారని, రాష్ట్రంలో నాటుసారా బాగా పెరిగిపోయిందని, గంజాయి కూడా బాగా పెరిగిపోయిందన్నారు. ఇటువంటి విషయాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.