ఆ మున్సిపల్ పీఠం టీడీపీ వశం.. ఎమ్మెల్యే సురేంద్రబాబు వ్యూహం ఫలించిందా? కడపలో మాత్రం వైసీపీ ఖాతాలోనే మేయర్ పీఠం
ఏదైనా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచిన టీడీపీ.. కడప మేయర్ పీఠాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడం వెనుక వ్యూహం వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Kalyandurg municipality: రావడం ఆలస్యమవుతుందేమో కానీ..రావడం మాత్రం పక్కా. వన్స్ స్టెపిన్ ఇక తిరుగుండదు అంటోంది టీడీపీ. ఒక్కో మున్సిపాలిటీలో జెండా పాతుతూ వస్తోంది. లేటెస్ట్‌గా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకుంది టీడీపీ. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా.. వైసీపీ నుంచి 11 మంది, టీడీపీ నుంచి 11 మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కీలకంగా మారారు.
ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు గౌతమికి మద్దతు ఇవ్వడంతో ఆమెకు వైసీపీకి కంటే రెండు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో 13 ఓట్లు సాధించి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు గౌతమి. అలా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి టీడీపీ ఖాతాలోకి చేరింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి ఎన్నికయ్యారు. (Kalyandurg municipality)
మున్సిపల్ ఛైర్మన్ పీఠం టీడీపీకి దక్కడంలో..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు..పార్టీ పవర్‌లో ఉండటంతో..మున్సిపల్ ఛైర్మన్ కుర్చీని తమ ఖాతాలో వేసుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో గెలవడం వైసీపీకి బిగ్ షాక్‌గా మారింది.
Also Read: ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ ఎందుకైంది? నెగటివిటీ, యాంటీ సెంటిమెంట్ రాకుండా ఇలా..
అయితే ఇది ప్రజల విజయమని..ప్రజా తీర్పు అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీని 11 ఎమ్మెల్యేలకు పరిమితం చేసినట్లే, కళ్యాణదుర్గంలో వైసీపీని 11 ఓట్లకే పరిమితం చేశామంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ఎప్పుడూ బీసీలకు రాజ్యాధికారమే ఇస్తుందని మరోసారి ప్రూవ్ అయిందన్నారు లీడర్లు. వాల్మీకి సమాజానికి ఛైర్మన్ పీఠం దక్కడం పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.
కడప మేయర్ పీఠం వైసీపీకే
అటు కడప మేయర్ పీఠం.. వైసీపీకే దక్కింది. ఒక్కరే మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఏకగ్రీవంగా ప్రకటించారు అధికారులు. 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ యునానిమస్‌గా ఎలక్ట్ అయ్యారు. 38 మంది కార్పొరేటర్లు మేయర్ ఎన్నికల్లో పాల్గొనగా..అందరూ వైసీపీ సభ్యులే కావడం చర్చకు దారితీస్తోంది. మేయర్ స్థానం ఆశించి భంగపడ్డ 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున..ఎలక్షన్‌కు దూరంగా ఉండిపోయారు. అసంతృప్తితోనే ఆయన మేయర్ ఎన్నికకు అటెండ్ కానట్లు తెలుస్తోంది.
ఇక్కడ మేయర్ కుర్చీ కోసం టీడీపీ ప్రయత్నాలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ అధినేత జగన్ ఇలాకాలో..పాగా వేయాలనుకుంటున్న టీడీపీ..కడప మేయర్ సీటును లైట్ తీసుకోవడానికి కారణమేంటన్న చర్చ జరుగుతోంది. కొందరు ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లకు టీడీపీ కండువా కప్పినప్పటికీ..మేయర్ ఎన్నికకు కావాల్సినంత మందిని చేర్చుకునే ప్రయత్నం చేయలేదా.? లేక టీడీపీలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు ఆసక్తిగా చూపలేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది.
ఏదైనా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచిన టీడీపీ.. కడప మేయర్ పీఠాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడం వెనుక వ్యూహం వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే అక్కడ కార్పొరేటర్లను చేర్చుకుని మేయర్ సీటును కైవసం చేసుకునే బదులు..రాబోయే ఎన్నికల్లో తమ నేతలకు కార్పొరేటర్లుగా అవకాశం కల్పించి గెలిచి మేయర్ కుర్చీని తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ వ్యూహం అంటున్నారు.
