Road Accident: రోడ్డు ప్రమాదంలో కర్నూలు మాజీ ఎంపిపి రాజవర్ధన్ రెడ్డి మృతి
కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురురు విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడు రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు

Rajavardhan
Road Accident: రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత కుమారుడు మృతి చెందారు. కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురురు విష్ణువర్ధన్ రెడ్డి కుమారుడు రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజవర్ధన్ రెడ్డి హైదరాబాద్ నుంచి కర్నూలుకు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద..కారు ప్రమాదానికి గురైంది. కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈప్రమాదంలో రాజవర్ధన్ రెడ్డి తీవ్రంగా గాయపడగా..వెంటనే స్పందించిన స్థానికులు ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు.
Also read:Police Constable: కానిస్టేబుళ్ల కక్కుర్తి.. అర్ధరాత్రి జంటను బెదిరించి..
అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే రాజవర్ధన్ రెడ్డి మృతి చెందారు. కొడుకు మృతి గురించి తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి గుండెలవిసేలా రోధించారు. కోడుమూరు నియోజకవర్గంలో రాజకీయాలు ప్రభావితం చేయగల వ్యక్తి ఎదురురు విష్ణువర్ధన్ రెడ్డి. రాజవర్ధన్ రెడ్డి సైతం గతంలో కర్నూలు ఎంపిపిగా పనిచేశారు. రాజవర్ధన్ రెడ్డి మృతితో కోడుమూరులోని విష్ణువర్ధన్ రెడ్డి ఇంటివద్ద విషాదం అలముకుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read:Covid-19: మాస్క్ లేకపోతే ఫైన్.. మళ్లీ అమల్లోకొచ్చిన నిబంధన!