Covid-19: మాస్క్ లేకపోతే ఫైన్.. మళ్లీ అమల్లోకొచ్చిన నిబంధన!

ఢిల్లీలో Covid-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది.

Covid-19: మాస్క్ లేకపోతే ఫైన్.. మళ్లీ అమల్లోకొచ్చిన నిబంధన!

Covid 19

Covid-19: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిచేస్తూ రూల్ తీసుకొచ్చింది.

Covid-19 Guidelines : ఢిల్లీ NCRలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూళ్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు..!

బుధవారం నుంచి ఈ నిబంధన అమలు చేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది. ప్రస్తుతం కోవిడ్ అదుపులో పెట్టేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అని డీడీఎమ్ఏ భావించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ రూల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నడిపేందుకు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు సంస్థలకు అనుమతినిచ్చింది.

Covid-19 : ఢిల్లీ స్కూల్లో కరోనా కలకలం..!టీచర్, విద్యార్థికి పాజిటివ్‌..!!

కరోనా కేసుల్ని గుర్తించేందుకు మెట్రో స్టేషన్స్, మార్కెట్లు, పబ్లిక్ ప్లేసుల్లో కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియెంట్ బి.1.10, బి.1.12 వైరస్‌లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీలో కొత్తగా మంగళవారం 632 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.43 శాతంగా ఉంది. ఢిల్లీ నగరంలో 625 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.