Covid-19 : ఢిల్లీ స్కూల్లో కరోనా కలకలం..!టీచర్, విద్యార్థికి పాజిటివ్‌..!!

ఢిల్లీ స్కూల్లో కరోనా కలకలం..పృష్టించింది.ఓ టీచర్, విద్యార్థికి పాజిటివ్‌ గా నిర్ధారణ కావటంతో స్కూల్ మూసివేశారు.

Covid-19 : ఢిల్లీ స్కూల్లో కరోనా కలకలం..!టీచర్, విద్యార్థికి పాజిటివ్‌..!!

Covid Cases In Delhi School

Covid cases in Delhi school : కోవిడ్ మహమ్మారి ముప్పుతో దాదాపు రెండేళ్లుగా కొనసాగుతోంది. దీంతో అన్ని విద్యాసంస్థలు మూసివేశారు. ఈ క్రమంలో కోవిడ్ కేసులు అత్యంత స్వల్పంగా ఉండటంతో తిరిగి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించారు. ఈక్రమంలో గురువారం (ఏప్రిల్ 14,2022)ఢిల్లీలోని స్కూల్లో మరోసారి కోవిడ్ పంజా విసిరింది. ఓ టీచర్ కు, ఓ విద్యార్ధికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్ధులందరిని ఇంటికి పంపించివేశారు. కోవిడ్ కలకలంతో విద్యార్ధులను ఇంటికి పంపించివేసిన క్రమంలో స్కూల్ తిరిగి ఎప్పుడు తెరుచుకుంటుంది? విద్యార్ధులకు ఆన్ లైన్ పాఠాలేనా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

Also read : Covid in India : ఢిల్లీలో 24 గంటల్లో 50 శాతం పెరిగిన కొవిడ్ కేసులు..

ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం అధికంగా కరోనా కొత్త కేసులొచ్చాయి. ఆ ప్రభావం ఓ స్కూల్ మీద కూడా పడింది. ఒక టీచర్, ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో విద్యార్థులందరినీ ఇంటికి పంపివేశారు. దీనిపై ఆప్ ఎమ్మెల్యే అతిశి మాట్లాడుతూ.. పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలిపారు.

దీనికి ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పాఠశాలలో కొవిడ్ కేసులు వచ్చాయి. అక్కడ 23 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. దాంతో స్కూల్ ను మూసివేశారు. మరోపక్క ఘజియాబాద్‌లోని స్కూల్లో కూడా ఇద్దరు విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా తేలడంతో.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు.

Also read : Bandi Sanjay : భారీ కాన్వాయ్‌తో గద్వాల్‌కు బండి సంజయ్.. ఈ సాయంత్రమే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర..!

2020 మార్చి నుంచి కరోనా కారణంగా విద్యాసంస్థలు సరిగా తెరుచుకోలేదు. ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. కొద్దినెలలుగా పిల్లలు సజావుగా పాఠశాలలకు వెళ్తున్నారు. ఇంతలోనే ఎక్స్‌ఈ వేరియంట్ దేశంలోకి ప్రవేశించింది. ఇప్పుడు దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండనుందో అని ఆందోళన నెలకొంది.