అకారణంగా నామినేషన్‌ తిరస్కరించారని టీడీపీ మద్దతుదారుల ఆందోళన

అకారణంగా నామినేషన్‌ తిరస్కరించారని టీడీపీ మద్దతుదారుల ఆందోళన

Updated On : February 5, 2021 / 5:53 PM IST

TDP supporters protest : చిత్తూరు జిల్లా మదనపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అకారణంగా తమ నామినేషన్‌ తిరస్కరించారని టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. వైసీపీ నాయకులను కార్యాలయంలో ఉంచుకుని, తమను బయటకు గెంటేశారని.. ఇసుక నూతనపల్లి పంచాయతీ టీడీపీ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

మరోవైపు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఏపీ ఎస్ఈసీ రద్దు చేసింది. టీడీపీ వివరణ సరిగా లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. వెంటనే మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం టీడీపీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు.

టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో కాపీలను ప్రచురించడం, పంపిణీ చేయడం నిషిద్ధమని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు. టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.