Blue Films : కీచక టీచర్.. క్లాస్ రూమ్‌లోనే అమ్మాయిలకు బ్లూఫిల్మ్స్ చూపించి..
కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కామంతో కళ్లు మూసుకుపోయి నీచానికి ఒడిగడుతున్నారు.

Blue Films
Blue Films : తల్లి, తండ్రే కాదు గురువు కూడా దైవంతో సమానం అంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూడటంలో గురువు బాధ్యత కీలకం. అందుకే.. సమాజంలో గురువుకు ఎంతో గౌరవం ఇస్తారు. కానీ కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే కామంతో కళ్లు మూసుకుపోయి నీచానికి ఒడిగడుతున్నారు. పవిత్రమైన స్కూల్ లో పాడు పనులకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. లైంగికంగా వేధించి రాక్షసానందం పొందుతున్నారు.
Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య
తాజాగా గూంటూరు జిల్లా సత్తెనపల్లిలో కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. శాలివాహననగర్ లోని ఉర్దూ స్కూల్ లో ఓ టీచర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కొమెరపూడి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అనే టీచర్ తమకు నీలి చిత్రాలు(బ్లూఫిలిమ్స్) చూపిస్తూ.. లైంగిక దాడికి పాల్పడుతున్నాడని 5వ తరగతి విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు స్కూల్ దగ్గరికి వచ్చి ఆందోళనకు దిగారు.
కొంతకాలంగా టీచర్ హుస్సేన్ కీచకుడిలా మారి తమ పిల్లలకు నీలి చిత్రాలు చూపిస్తూ.. లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ వేధింపులతో చాలా రోజులుగా తమ పిల్లలు ఇబ్బంది పడ్డారని వాపోయారు. టీచర్‌ని నమ్మి పిల్లల్ని స్కూల్‌లో వదిలిపెట్టి తాము పనులకు వెళ్తుంటే ఇలాంటి పనులా చేసేదని నిలదీశారు.
కీచక టీచర్ హుస్సేన్‌పై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల దగ్గర విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.