దువ్వాడ వాణికి పోలీసుల నోటీసులు..
తన భర్త దువ్వాడ శ్రీనివాస్ కు ముందుగా నోటీసులు ఇచ్చి తన వద్దకు రావాలని ఖరాఖండిగా చెప్పారు దువ్వాడ వాణి.

Notices To Duvvada Vani : టెక్కలిలో పది రోజులుగా నిరసన తెలుపుతున్న దువ్వాడ వాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా నిరసన విరమించాలని సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చారు. టెక్కలి సీఐతో ఫోన్ లో మాట్లాడిన దువ్వాడ వాణి.. తన లాయర్ తో చర్చించిన తర్వాత చెప్తానని బదులిచ్చారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ కు ముందుగా నోటీసులు ఇచ్చి తన వద్దకు రావాలని ఖరాఖండిగా చెప్పారు దువ్వాడ వాణి.
పదో రోజుకు దువ్వాడ వాణి నిరసన..
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై ఆయన భార్య, కుమార్తెల నిరసన ఇవాళ్టితో 10వ రోజుకి చేరింది. భార్య, భర్తల మధ్య రాజీ కోసం కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలోని కారు షెడ్ లోనే దువ్వాడ వాణి, హైందవి, నవీన లు తమ నిరసన కొనసాగిస్తున్నారు. దువ్వాడ వాణికి ఆమె కుటుంబసభ్యులు మద్దతుగా నిలిచారు. అటు ఎమ్మెల్సీ శ్రీనివాస్.. కొత్త ఇంటికే పరిమితం అయ్యారు. శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి తమకు అనుమతి ఇవ్వాలని భార్య, పిల్లలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?