TSRTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ రెండు మార్గాల్లో ప్రత్యేక ఆఫర్

ఆ రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది.

TSRTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. ఆ రెండు మార్గాల్లో ప్రత్యేక ఆఫర్

VC Sajjanar - MD TSRTC

TSRTC – Telangana: కర్ణాటక రాజధాని బెంగుళూరు(Bengaluru), ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ (Vijayawada) రూట్లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ (VC Sajjanar) ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ ఇవ్వనుందని వివరించారు. ఈ మేరకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో జులై 2 నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుందని చెప్పారు.

ఈ ఆఫర్ ఈ ఏడాది ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆ రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని అన్నారు. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించిందని వివరించారు.

బస్సుల్లో రానూపోను ఒకేసారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుందని స్పష్టతనిచ్చారు. దీనివల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో టికెట్ పై ఆదా అవుతుందని తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం tsrtconline.in ను ఓపెన్ చేయొచ్చని అన్నారు.