Gudivada TDP: కొడాలి నానికి ప్రత్యర్థిని వెతకడమే పెద్ద సవాల్.. గుడివాడ టీడీపీ అభ్యర్థి ఎవరంటే!

కొడాలి నాని స్పీడ్‌కు బ్రేక్‌లు వేసే యువనాయకత్వం కోసం తెలుగుదేశం పార్టీ అన్వేషిస్తోంది. ఆయనను దింపితే బాగుంటుందని భావిస్తోంది టీడీపీ అధిష్టానం..

Gudivada TDP: కొడాలి నానికి ప్రత్యర్థిని వెతకడమే పెద్ద సవాల్.. గుడివాడ టీడీపీ అభ్యర్థి ఎవరంటే!

Kodali Nani, Raavi Venkateswara Rao

Gudivada TDP Candidate: గుడివాడ.. ఈ పేరు వింటే గుర్తొచ్చేది మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) అధికార వైసీపీలో నాని ఓ హీరో.. ప్రతిపక్ష టీడీపీకి అతడో విలన్. టీడీపీ కోటను తన అడ్డాగా చేసుకున్నారు నాని.. పదునైన మాటలు.. దూకుడు స్వభావంతో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కి.. అధినేత చంద్రబాబు (Chandrababu)కు టార్గెట్ అయ్యారు. ఈ సారి నానిని ఎలాగైనా ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కోరుకుంటున్నాడు. ఐతే నానికి ప్రత్యర్థిని వెతకడమే పెద్ద సవాల్‌గా మారింది టీడీపీకి.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు (Raavi Venkateswara Rao) ఎన్‌ఆర్‌ఐ రాముల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతోంది.. ఈ ఉత్కంఠకు త్వరలో తెరపడుతోందంటున్నారు.. ఇందులో నిజమెంత..?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. అన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడ. టీడీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా 2004, 2009ల్లో తెలుగుదేశం పార్టీ తరఫునే గెలిచారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి వైసీపీలో చేరారు. ఆ తర్వాత కూడా నాని విజయాన్ని ఆపలేకపోయింది టీడీపీ.. పార్టీ వ్యవస్థాపకుడు సొంత స్థానమైనా.. నాయకత్వ సమస్యతో ప్రతి ఎన్నికకూ.. నానిపై అభ్యర్థులను మార్చుతూ విఫలమవుతోంది టీడీపీ. నాని తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాక ఆయనపై 2014లో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును పోటీకి దింపింది. 2019లో దేవినేని అవినాశ్‌కి టిక్కెట్ ఇచ్చింది. అవినాశ్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలోకి వెళ్లిపోవడంతో 2024లో మళ్లీ నాని ప్రత్యర్థిని వెతుకే పనిలో పడింది టీడీపీ.

Also Read: గన్నవరం వైసీపీలో మూడు వర్గాలు.. దుట్టా, యార్లగడ్డ, వంశీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమా?

ప్రస్తుతం గుడివాడ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఐతే ఆయన వయసు రీత్యా నానిపై దూకుడు ప్రదర్శించలేకపోతున్నారని భావిస్తోంది టీడీపీ అధిష్టానం. నాని స్పీడ్‌కు బ్రేక్‌లు వేసే యువనాయకత్వం కోసం అన్వేషిస్తోంది. ఈ వెతుకులాటలోనే ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము తెరపైకి వచ్చారు. వెనిగండ్ల ట్రస్టుతో గుడివాడ నియోజవకర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న రాము.. దూకుడూ చూపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పాల్గొంటున్నారు. దీంతో గుడివాడ బరిలో రామును దింపితే బాగుంటుందని భావిస్తోంది టీడీపీ అధిష్టానం.. రామును ప్రోత్సహిస్తోంది. కానీ రాముయే అభ్యర్థిగా ప్రకటించలేకపోతోంది.

Also Read: వైనాట్ 175 అంటున్న వైసీపీ.. కొత్త టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు.. రీచ్ అవుతారా?