Miss Universe Singapore-2021 : మిస్ సింగపూర్‌గా ఆంధ్రప్రదేశ్ యువతి
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్ యూనివర్స్ సింగపూర్-2021గా ఎన్నికయ్యింది నందిత.

Miss Universe Singapore 2021
Miss Universe Singapore-2021 : సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్ యూనివర్స్ సింగపూర్-2021గా ఎన్నికయ్యింది నందిత. కాగా నందిత తల్లిదండ్రులది శ్రీకాకుళం జిల్లా 25 ఏళ్ళక్రితం నందిత తల్లిదండ్రులు మాధురి, గోవర్ధన్ లు సింగాపూర్ వెళ్లి స్థిరపడ్డారు.
Read More : Amazon: ఫేక్ రివ్యూస్.. చైనీస్ బ్రాండ్‌లపై నిషేధం విధించిన అమెజాన్!
నందితకు ఫ్యాషన్ ప్రపంచం అంటే చాలా ఇష్టం. చదువుకుంటూ పార్ట్ టైమ్ మోడల్‌గా పని చేసేది నందిత. ఇక ఈ నేపథ్యంలోనే మిస్ యూనివర్స్ సింగపూర్-2021 పోటీల్లోపాల్గొంది. తన అందం తెలివితో మొదటి స్తానంలో నిలిచింది. ఈ సందర్బంగా నందిత మాట్లాడుతూ జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తెలిపింది.
Read More : Thunderstorm on bike : బైక్ పై వెళ్తుండగా పిడుగుపాటు.. భార్యాభర్తలు మృతి
కాగా నందిత సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ కోర్సు అభ్యసిస్తోంది. అంతే కాదు సామజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకత్వం చూపడమే కాక జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది.