Amazon: ఫేక్ రివ్యూస్.. చైనీస్ బ్రాండ్‌లపై నిషేధం విధించిన అమెజాన్!

గ్లోబల్‌గా ఈ కామర్స్ మార్కెట్‌లో ది బిగ్ గా ఉన్న అమెజాన్ 600 చైనీస్ బ్రాండ్‌లను నిషేధించి ప్రొడక్ట్‌ లిస్ట్‌ నుంచి తొలగించింది.

Amazon: ఫేక్ రివ్యూస్.. చైనీస్ బ్రాండ్‌లపై నిషేధం విధించిన అమెజాన్!

Amazon

Amazon: గ్లోబల్‌గా ఈ కామర్స్ మార్కెట్‌లో ది బిగ్ గా ఉన్న అమెజాన్ 600 చైనీస్ బ్రాండ్‌లను నిషేధించి ప్రొడక్ట్‌ లిస్ట్‌ నుంచి తొలగించింది. అమెజాన్ విధానాలను బ్రాండ్ ఉల్లంఘించిందని కంపెనీ తెలిపింది. వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం, కొన్ని చైనా బ్రాండ్లు రివ్యూ రేటింగ్ ఇచ్చినందుకు బదులుగా వినియోగదారులకు బహుమతులను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీ అమెజాన్‌.. చైనాకు కోలుకోలేని షాక్‌ ఇచ్చింది.

తన ప్లాట్‌ఫామ్‌​ నుంచి చైనాకు చెందిన 3,000 ఆన్‌లైన్‌ స్టోర్‌లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఫేక్ రివ్యూలు ఇప్పించుకుని, ప్రాడెక్టులను ప్రమోట్ చేసుకుంటున్నారనే ఆరోపణలతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది అమెజాన్ సంస్థ. అమెజాన్ తీసపుకున్న ఈ నిర్ణయంతో సుమారు 130 మిలియన్ల చైనీస్‌ యువాన్‌(రూ. 148కోట్లు) నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు.

‘మేడ్‌ ఇన్‌ చైనా.. సోల్డ్‌ ఇన్‌ అమెజాన్‌’ పేరుతో ఏర్పాటైన మర్చంట్‌ కమ్యూనిటీ ఈ ఫేక్ రీవ్యూలకు సంబంధించిన తతంగాన్ని నడిపించినట్లుగా అమెజాన్ గుర్తించింది. ఇది వినియోగదారుల రీవ్యూ ఉల్లంఘన కిందకు వస్తుందని వెల్లగడించిన అమెజాన్‌.. ప్రాడెక్ట్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రోత్సాహక రివ్యూలను 2016 నుంచి అమెజాన్‌ సంస్థ బ్యాన్‌ చేస్తూ వస్తోంది. అంతేకాదు అలాంటి ఉల్లంఘనలను నిరంతరం పర్యవేక్షిస్తోంది అయినప్పటికీ చైనా మార్కెట్‌లో ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణం అవడంతో అమెజాన్‌ మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది.

అన్ని బ్రాండ్ల పేర్లు తెలియకపోయినా, వాటిలో కొన్ని చైనాలో బాగా ప్రాచుర్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. Auki MPo, Rawpower, Wawa అమెజాన్ ద్వారా శాశ్వతంగా నిషేధించబడిన కొన్ని ‘పెద్ద’ బ్రాండ్లు. అయితే, అమెజాన్ ఈ బ్రాండ్‌లను నిషేధించిన తర్వాత ఈబే మరియు అలీ ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర ఈ-కామర్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయి.