Lenin Naga Kumar : కెనడాలో తెలుగు విద్యార్థి లెనిన్ నాగ కుమార్ మృతి.. స్వగ్రామానికి చేరుకున్న పార్థివ దేహం
లెనిన్ నాగ కుమార్ పార్థివదేహం రాత్రి గన్నవరం చేరుకోగా అక్కడ నుండి మచిలీపట్నం స్వగ్రామం చింతగుంటపాలెం తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.

Lenin Naga Kumar
Lenin Naga Kumar died : కెనడాలో తెలుగు విద్యార్థి పోలుకొండ లెనిన్ నాగ కుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏపీ మచిలీపట్నం విద్యార్థి పోలుకొండ లెనిన్ నాగ కుమార్ పార్థివ దేహం స్వగ్రామం కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చేరుకుంది. జులై 3వ తేదీన పోలుకొండ లెనిన్ నాగ కుమార్ స్నేహితులతో కలిసి కెనడాకు వెళ్లారు.
అక్కడ లెనిన్ నాగ కుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. లెనిన్ నాగ కుమార్ పార్థివ దేహాన్ని ఇండియాకు తీసుకురావాలని అతని తల్లిదండ్రులు జిల్లా అధికారుల ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన మచిలీపట్నం ఎంపీ కెనడా నుండి ఇండియాకు లెనిన్ నాగ కుమార్ పార్థివదేహాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.
లెనిన్ నాగ కుమార్ పార్థివదేహం రాత్రి గన్నవరం చేరుకోగా అక్కడ నుండి మచిలీపట్నం స్వగ్రామం చింతగుంటపాలెం తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.