YCP Politics : తాడికొండ వైసీపీలో ఆధిపత్యపోరు .. ఎమ్మెల్సీ డొక్కా .. ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు బాహాబాహీ

తాడికొండలో ఉద్రిక్తత నెలకొంది. ఇంచార్జి నియామకంపై గత కొన్నాళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతోంది. ఈక్రమంలో తాడికొండ సొసైటీ సెంటర్ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా నియోజక వర్గానికి సమన్వయ కర్త ఎందుకు అంటూ శ్రీదేవి వర్గీయులు నినాదాలు చేస్తే..బ్రోకర్ వ్యవస్థ నశించాలి అంటూ డొక్కా వర్గీయులు నినాదాలు చేశారు.

YCP Politics : తాడికొండ వైసీపీలో ఆధిపత్యపోరు .. ఎమ్మెల్సీ డొక్కా .. ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు బాహాబాహీ

YCP Politics In Tadikonda

Updated On : August 27, 2022 / 1:52 PM IST

YCP Politics : తాడికొండలో ఉద్రిక్తత నెలకొంది. ఇంచార్జి నియామకంపై గత కొన్నాళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి..వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతోంది. ఈక్రమంలో తాడికొండ సొసైటీ సెంటర్ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా నియోజక వర్గానికి సమన్వయ కర్త ఎందుకు అంటూ శ్రీదేవి వర్గీయులు నినాదాలు చేస్తే..బ్రోకర్ వ్యవస్థ నశించాలి అంటూ డొక్కా వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గీయుల మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో పోటీ పోటీగా నినాదాలు చేయటంతో తాడికొండ సొసైటీ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదరావు నియామకంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భగ్గుమంటున్నారు. దీంట్లో భాగంగా మాజీ హోం మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత క్యాంపు కార్యాలయం వద్దకు తన అనుచరులతో చేరుకుని ఎమ్మెల్యే శ్రీదేవి నిరసనకు దిగారు. సుచరిత బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. దళిత ఎమ్మెల్యేను అవమానపరుస్తారా? అని మండిపడ్డారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన డొక్కాను సమన్వయకర్తగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె వర్గీయులతో మాజీ మంత్రి సుచరిత చర్చలు జరిపారు. సమస్యను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సుచరిత సమాధానంతో కాస్త్ తగ్గిన ఎమ్మెల్యే శ్రీదేవి..ఆమె వర్గీయులు వెళ్లిపోయారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదరావును తాడికొండ సమన్వయకర్తగా కొనసాగిస్తే తాము రాజీనామా చేస్తామని వైసీపీ తుళ్లూరు మండల అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీదేవి వర్గానికి చెందిన బొర్రా శివరామిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీదేవి నివాసంలో బొర్రా మాట్లాడుతూ.. సమన్వయకర్తను నియమించేప్పుడు తమను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నిస్తూ..ఎమ్మెల్యే ఉండగా..కొత్తగా సమన్వయకర్తను ఎందుకు నియమించారని నిలదీశారు. ఎమ్మెల్యే శ్రీదేవికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇలా సమన్వయ కర్త నియామకంపై అటు డొక్కా వర్గీయులకు..ఇటు శ్రీదేవి వర్గీయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాగా..నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై వ్యతిరేకత వస్తోందని..అందుకే జగన్ ఆమెను పక్కన పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.