ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ.. ఎస్ఈసీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

High Court hearing on SEC petition : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. అయితే, ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికలను సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టును కోరింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్‌కు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్‌లో తెలిపింది ఎస్‌ఈసీ. ప్రభుత్వం చెబుతున్నట్లు ఎన్నికల ప్రక్రియ.. వ్యాక్సినేషన్‌కు ఏమాత్రం అడ్డు కాదంటోంది SEC. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న డివిజన్ బెంచ్.. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.