Accused Escaped : జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్న నిందితుడు

ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ నిందితుడిని సబ్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Accused Escaped : జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్న నిందితుడు

ACCUSED (1)

Updated On : January 13, 2023 / 5:02 PM IST

accused escaped : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ నిందితుడిని సబ్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. పొన్నాడ రాంబాబు అనే వ్యక్తి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. పోలీసులకు పట్టుబడి రిమాండ్ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడు రాంబాబును పాలకొండ సబ్ జైలుకు తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు.

Assam: బెయిల్ ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగిన 112 మంది ఖైదీలు

నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో రాజాం, పాలకొండ, విజయనగరం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడు తప్పించుకోవడంపై పోలీసుల ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీ విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.