Araku Chali Utsav: 3 రోజులపాటు అరకు చలి ఉత్సవ్‌.. ఎలా జరుపుకుంటారో తెలుసా?

గిరిజన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తారు.

Araku Chali Utsav: 3 రోజులపాటు అరకు చలి ఉత్సవ్‌.. ఎలా జరుపుకుంటారో తెలుసా?

Araku Chali Utsav

Updated On : January 31, 2025 / 7:57 AM IST

అల్లూరి జిల్లాలోని అరకు లోయలో శుక్రవారం నుంచి మూడు రోజులు పాటు చలి ఉత్సవం జరుగుతుంది. ఇందుకుగానూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతోపాటు స్థానికులు హాజరవుతారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేదికను సిద్ధం చేశారు. వివిధ సర్కారు శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్‌ రైడ్‌ నిలుస్తుంది.

పిల్లలకు రూ.2,000.. పెద్దలకు రూ.4,000 చొప్పున ధరను నిర్ణయించారు. హెలికాప్టర్‌లో అరకు అందాలను తిలకించే అవకాశం ఉంది. అలాగే, కొత్తవలస ఉద్యానంలో పారా మోటార్‌ గ్లైడింగ్‌ ఏర్పాటు చేశారు.

Gold And Silver Price: వామ్మో.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గేలాలేవు!

ఇవాళ ఉదయం అరకులోయ సర్కారు డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు మారథాన్‌ నిర్వహించారు. ఇవాళ పద్మాపురం బొటానికల్‌ గార్డెన్స్‌లో ఫ్లవర్‌ షోను ప్రారంభం చేస్తారు. అలాగే, పెయింటింగ్‌ పోటీలను నిర్వహిస్తారు.

ఇవాళ మధ్యాహ్నం 25 స్టాళ్ల ప్రారంభోత్సవం ఉంటుంది. ఇవాళ సాయంత్రం గిరిజన కళాకారుల నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తారు. ఇక శనివారం ఉదయం సైక్లింగ్‌ ఈవెంట్‌ ఉంటుంది. శనివారం సాయంత్రం ఫ్యాషన్‌ షో నిర్వహిస్తారు.

అలాగే, గిరిజన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తారు. ఇక ఆదివారం ఉదయం సుంకరమెట్ట కాఫీ తోటల నుంచి అరకు ట్రెక్‌ ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.