Boy Murdered In Kadapa : కడపలో దారుణం..అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపిన అత్తామామలు

కడపలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడిని స్వయాన మేనత్త, మేన మామ హత మార్చారు. అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Boy Murdered In Kadapa : కడపలో దారుణం..అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపిన అత్తామామలు

Boy Murdered In Kadapa

Updated On : September 4, 2022 / 4:15 PM IST

Boy Murdered In Kadapa : కడపలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడిని స్వయాన మేనత్త, మేన మామ హత మార్చారు. అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయాన్ అనే బాలుడి తల్లిదండ్రులు ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లారు. గల్ఫ్ కు వెళ్తూ బాలుడిని మేనత్త, మేనమామ వద్ద వదలి వెళ్లారు.

ఈ నేపథ్యంలో అల్లరి చేస్తున్నాడని బాలుడిని అత్తామామలు తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలైన అయాన్ స్పృహతప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయాడు. బాలుడు అయాన్ శరీరంపై తీవ్రమైన గాయాలు, తొడలపై వాతలు ఉన్నాయి.

Gwalior Constable: డబ్బులడిగి విసిగిస్తున్నాడంటూ ఆరేళ్ల బాలుడిని గొంతు పిసికి చంపిన పోలీస్ కానిస్టేబుల్

కాగా, బాలుడిని చిత్రహింసలు పెట్టి చంపారని స్థానికులు అంటున్నారు. బాలుడి అత్తామామలు పరారీలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.