Maoists Letter: మంత్రి సీదిరిపై మరో లేఖ విడుదల చేసిన మావోలు
రామకృష్ణాపురం, సూదికొండ, నెమలికొండ తదితర భూముల నుండి వైదొలగాలంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. త్యాగాల బాటన నడిచే మావొయిస్టుల గురించి మంత్రి, అతని అనుచరులు దుష్ర్పచారం ఆపాలని సూచించారు. దోపిడి, దౌర్జన్యాలకు మగింపు పలకాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ నేతల భూ ఆక్రమణలపై ఈనెల మూడవ తేదీన మావోయిస్టుల హెచ్చరిక లేఖ విడుదలైంది

The Maoists released another letter against Minister Sidiri
Maoists Letter: మంత్రి సీదిరి అప్పలరాజుపై మావోయిస్టులు మరో సారి లేఖ విడుదల చేశారు. మంత్రి సీదిరి, అతని అణుచరుల వ్యవహార శైలిని తప్పు పడుతూ మావోయిస్టులు వరుసగా లేఖలు విడుదల చేస్తున్నారు. మావోయిస్టగ పార్టీపై మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న దుష్ర్పచారం ఖండించాలంటూ విప్లవ యువజన సంఘం పేరుతో తాజా లేఖ విడుదలైంది. మంత్రికి వత్తాసు పలుకుతున్న వ్యక్తులు పద్దతి మార్చుకొకుంటే జనం బుద్దిచెబుతారని విప్లవ యువజన సంఘం, ఆంధ్రా ఒడిషా బోర్డర్ కమిటి హెచ్చరించింది. మావోయిస్టు, ప్రజాసంఘాల నేతలుగా చెలామని అవుతూ, మంత్రికి సహాకారం అందిస్తున్న వైఖరి మానుకొవాలని సూచించారు.
రామకృష్ణాపురం, సూదికొండ, నెమలికొండ తదితర భూముల నుండి వైదొలగాలంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. త్యాగాల బాటన నడిచే మావొయిస్టుల గురించి మంత్రి, అతని అనుచరులు దుష్ర్పచారం ఆపాలని సూచించారు. దోపిడి, దౌర్జన్యాలకు మగింపు పలకాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ నేతల భూ ఆక్రమణలపై ఈనెల మూడవ తేదీన మావోయిస్టుల హెచ్చరిక లేఖ విడుదలైంది. అయితే ఈ లేఖను కండిస్తూ పలాసలో భూ అక్రమణలు జరగలేదంటూ మంత్రి సీదిరి అనుచరులు ఖండించారు.
Cong President Poll: అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తి.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన శశి థరూర్