Chandrababu Kuppam Tour : చంద్రబాబు కుప్పం పర్యటనలో నాలుగు ఎఫ్ఐఆర్లు.. 28 మందిపై కేసులు, మరో 50 మందిపై నమోదు చేసే ఛాన్స్

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. చైతన్య రథం సౌండ్ సిస్టమ్ కు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గంగవరం సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదుతో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.

Chandrababu Kuppam Tour : చంద్రబాబు కుప్పం పర్యటనలో నాలుగు ఎఫ్ఐఆర్లు.. 28 మందిపై కేసులు, మరో 50 మందిపై నమోదు చేసే ఛాన్స్

FIRE

Updated On : January 10, 2023 / 4:16 PM IST

Chandrababu Kuppam Tour : టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. చైతన్య రథం సౌండ్ సిస్టమ్ కు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గంగవరం సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదుతో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. గంగవరం ఎస్ ఐ సుదాకర్ రెడ్డి ఫిర్యాదుతో నలుగురిపై, చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన మరో పోలీసు ఫిర్యాదుతో 11 మందిపై కేసు నమోదు చేశారు.

అయితే ఇప్పటివరకు నాలుగు కేసులకు సబంధించి 28 మందిపై కేసులు నమోదు చేశారు. మరో 50 మందికి పైగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. నిన్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా ఆ నలుగురికీ బెయిల్ మంజూరు అయింది. అటు కుప్పం నేతలపై కేసులు, అరెస్టుల వ్యవహారంపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు.

Chandrababu Letter DGP : కుప్పం ఘటనలపై డీజీపీకి చంద్రబాబు లేఖ

కుప్పంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని నిన్న డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఇవాళ మరికొంత మంది టీడీపీ నేతలను అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య జరిగిన ఘర్షణ వీడియో ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కొందరు నేతలు కోర్టుకు వెళ్లారు. మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇటీవల చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందారు. దీంతో ప్రభుత్వం రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ మంగళవారం (జనవరి 3,2022) ఉత్తర్వులు జారీచేసింది. కందుకూరు, గుంటూరు ప్రాంతాల్లో చంద్రబాబు సభల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించారు. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Chandrababu Dharna On Road : లేఖ రాసినా డీజీపీ స్పందించరా? అంటూ రోడ్డుపై చంద్రబాబు ధర్నా

ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసి వాహనం తాళాలు పట్టుకుపోయారు. దీంతో కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.