Sainath Sharma : టీడీపీ నేత సాయినాథ్‌శర్మకు చంపేస్తామంటూ బెదిరింపులు

సాయినాథ్‌ కారుతో పాటు ఆయన ఇంటికి కూడా దుండగులు కాగితాలు అంటించారు. రాజకీయాలు నీకెందుకు అంటూ బెదిరిస్తూ లేఖలు అంటించడం కలకలం రేపింది. దీంతో సాయినాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Sainath Sharma : టీడీపీ నేత సాయినాథ్‌శర్మకు చంపేస్తామంటూ బెదిరింపులు

Sainath Sharma

Updated On : May 17, 2022 / 12:22 PM IST

TDP Sainath Sharma : వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామంటూ కాగితాలపై రాసి కారుకు అంటించారు. కమలాపురంలో రామాపురం గుడి దగ్గర కారును పార్క్‌ చేసి వున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నిన్న అర్ధరాత్రి దాటాకా కారును ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

Balineni Warn TDP : టీడీపీ నేతలకు మాజీ మంత్రి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

సాయినాథ్‌ కారుతో పాటు ఆయన ఇంటికి కూడా దుండగులు కాగితాలు అంటించారు. రాజకీయాలు నీకెందుకు అంటూ బెదిరిస్తూ లేఖలు అంటించడం కలకలం రేపింది. దీంతో సాయినాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపు కమలాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శికి బెదిరింపులు రావడం హాట్‌ టాపిక్‌ అయింది.