ఏపీలో త్రీ క్యాపిటల్స్.. బీజేపీ సపోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజధానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. జగన్ మరో తుగ్లక్ అని టీడీపీ అంటే.. ఒక్క అమరావతికే దిక్కులేదంటే.. మూడు రాజధానులా అంటూ జనసేన విమర్శించింది. కానీ బీజేపీ మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్ధించింది. సౌతాఫ్రికా తరహాలో ఏపీలో మూడు రాజధానులు ఉండే అవకాశముందని జగన్ అసెంబ్లీలో 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం శాసనసభలో చెప్పారు.
* ఏపీ ప్రజలంతా ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. టీడీపీ జగన్ ప్రకటనపై తీవ్ర స్థాయిలో మండిపడింది. జగన్ ప్రతిపాదనను తుగ్లక్ చర్యగా అభివర్ణించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌ను చూస్తుంటే తుగ్లక్ పాలనే కాస్త నయమేమో అనిపిస్తోందన్నారు.
* ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణను బీజేపీ స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాజధాని మూడు చొట్ల ఉండొచ్చన్న సీఎం జగన్ ప్రకటనపై సానుకూలంగా స్పందించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిలోనే సీడ్ క్యాపిటల్ ఉండాలని చెప్పారు.
* మూడు రాజధానుల ప్రతిపాదనపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే..కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అమరావతి రాజధానికే ఇప్పటిదాకా దిక్కూ దివాన లేదు. మరి జగన్‌రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? కమిటీ రిపోర్ట్ రాకమునుపే జగన్‌రెడ్డి మూడు రాజధానులపై అభిప్రాయం చెప్పేశారు.
* అమరావతిని గుర్తించి మ్యాప్‌లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి? హైకోర్టు కర్నూలులో ఉంటే శ్రీకాకుళం నుంచి కర్నూలు వెళ్లాలా?అనంతపురం నుంచి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, సెక్రటేరియట్‌లో పని ఉంటే వెళ్లడం సాధ్యమయ్యే పనేనా? అని పవన్ నిలదీశారు. మొత్తానికి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి.
Read More : ఏపీలో మూడు రాజధానులు : సౌతాఫ్రికా మోడల్ ఏంటీ