వాళ్లు రైతులు కాదు : భూములు కొట్టేసిన వాళ్లే ధర్నాలు చేస్తున్నారు

రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలు..ఆందోళనలు చేసేవారంతా రైతులు కాదనీ..రాజధాని అమరావతి పేరుతో రైతుల దగ్గర భూములు కొట్టేసినవారే ధర్నాలు చేస్తున్నారనీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా? భూములకు విలువ పడిపోయందని ఆందోళన చేస్తున్నారా? అంటూ తీవ్ర విమర్శలుచేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటను ఆయన స్వాగతించారు. జగన్ ను అభినందించారు.రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసి..పాలనను అన్ని ప్రాంతాలకు విస్తరించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే ధర్నాలు..రాస్తా రోకోలు అంటూ ఎందుకు రాద్ధాతం చేస్తున్నారని స్పీకర్ ప్రశ్నించారు. పాలన అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే రాష్ట్రం అభివృద్ధి జరగుతుందని అన్నారు.
కాగా రాష్ట్రానికి మూడు రాజధాలను అంటూ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు.రైతు కుటుంబాల్లోని మహిళలు కూడా రోడ్డుపై కూర్చుని మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ కు ఓట్లు వేసి సీఎం ను చేస్తే మమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టావు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు మహిళలు. రైతులు చేపట్టిన ఈ ఆందోళనలకు విద్యార్ధులు సైతం మద్దతు తెలిపారు.