విశాఖలో నాటుసారా అనుకుని స్పిరిట్ ముగ్గురు మృతి
విశాఖ జిల్లా కశింకోటలోని గోవిందరావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాటు సారా అనుకుని సర్జికల్ స్పిరిట్

విశాఖ జిల్లా కశింకోటలోని గోవిందరావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాటు సారా అనుకుని సర్జికల్ స్పిరిట్
విశాఖ జిల్లా కశింకోటలోని గోవిందరావు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాటు సారా అనుకుని సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు మృతి చెందారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు స్పిరిట్ తాగగా.. అందులో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు. మరో వ్యక్తి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతులను నూకరాజు, ఆనంద్, అప్పారావుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు ముగ్గురూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి మరణంతో ఆయా కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.