AP Finance Ministry : ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

ఏపీ ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్, ఒక అసిస్టెంట్ సెక్రటరీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

AP Finance Ministry : ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

Ap

Updated On : August 4, 2021 / 10:40 AM IST

AP Finance Ministry : ఏపీ ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్, ఒక అసిస్టెంట్ సెక్రటరీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్స్ గా పని చేస్తున్న డి. శ్రీనుబాబు, కే.వర ప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేశారు.

ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం లీక్ చేస్తున్నారని భావించిన ప్రభుత్వం ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్యార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.