Tirumala Brahmothsavalu : తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం పుష్కరణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Tirumala Brahmothsavalu
Tirumala Tirupati Devasthanams : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం పుష్కరణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి చక్రత్తాళ్వారుకు ఘనంగా స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో భక్తులను పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతించారు. భక్తులు గోవింద నామస్మరణలతో తిరువీధులన్నీ మారుమోగాయి. మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో నిర్వహించే ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఇదిలాఉంటే.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6.55 గంటలకు రథోత్సవం నిర్వహించారు. మాడ వీధుల్లో రథంపై శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. సోమవారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనసేవ జరిగింది.