Tirumala Brahmotsavam: 27 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 12వేలు దాటితే మీ వాహనాలకు నో ఎంట్రీ ..

27 నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య 12 వేలు దాటితే ఆ తరువాత వచ్చే వాహనాలను కొండపైకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లాలని టీటీడీ భద్రతా అధికారులు భక్తులకు సూచిస్తున్నారు.

Tirumala Brahmotsavam: 27 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 12వేలు దాటితే మీ వాహనాలకు నో ఎంట్రీ ..

Tirumala

Updated On : September 23, 2022 / 1:33 PM IST

Tirumala Brahmotsavam: ఈనెల27 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారని టీటీడీ పాలక మండలి అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనాల విషయంలో క్లారిటీ ఇచ్చింది టీటీడీ. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల దర్శనాన్ని రద్దుచేయడంతో పాటు, వీవీఐపీలు, వీఐపీ దర్శనంలోనూ పరిమితులు విధించింది.

Tirumala Srivari Brahmotsavam : ఈ నెల 27నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ

ఇదిలాఉంటే తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ మంది సొంత వాహనాల్లో వచ్చే అవకాశం ఉంది. సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య ఎక్కువైతే.. తిరుమల కొండకు వెళ్తే దారిలో ట్రాఫిక్ ఇబ్బందితో పాటు భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొండపైకి వెళ్లే వాహనాల సంఖ్య విషయంలోనూ టీటీడీ పరిమితులు విధించింది. బ్రహ్మత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు కొండపైకి వెళ్లే వాహనాల సంఖ్య 12వేలు దాటితే కొండపైకి వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించింది.

Tirumala Srivari Brahmotsavam 2022 : తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య ఘ‌ట్టాలు

ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే వాహనాల సంఖ్య 12 వేలు దాటితే ఆ తరువాత వచ్చే వాహనాలను కొండపైకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లాలని టీటీడీ భద్రతా అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం గరుడ వాహన సేవరోజు ఉదయం నుంచి తరువాత రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. అయితే ఈఏడాది మాత్రం గరుడ సేవ అక్టోబర్ 1వ తేదీ కాగా.. సెప్టెంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించకుండా చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.