Tirumala Srivari Brahmotsavam : ఈ నెల 27నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. కరోనా తర్వాత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబరు ఐదో తేదీ వరకు నాలుగు మాడవీధుల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

Tirumala Srivari Brahmotsavam : ఈ నెల 27నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ

Tirumala Srivari Brahmotsavam

Updated On : September 12, 2022 / 9:29 PM IST

Tirumala Srivari Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం రెడీ అవుతోంది. కరోనా తర్వాత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు నాలుగు మాడవీధుల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 20న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది.

ఈనెల 26వ తేదీ రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 27 సాయంత్రం 5.45 నుంచి 6.15గంటల వరకు మీనలగ్నంలో ధ్వజారోహణం ఉంటుంది. ఈ నెల 27న రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి జగన్….శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారని తెలిపారు. సెప్టెంబరు 28న ఉదయం ముఖ్యమంత్రి పరకామణి నూతన భవనాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు.

Tirumala Brahmotsavalu 2022 : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. బ్రహ్మోత్సవాలకు మాస్క్ మస్ట్

ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ భవనంలో కానుకల లెక్కింపును భక్తులు చూసేందుకు వీలుగా రెండువైపులా అద్దాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తిరుమలలో 50 శాతం గదులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని ఈవో వివరించారు. ఇక తిరుమల శ్రీవారికి ఆగస్టు నెల హుండీ ఆదాయం 140.34 కోట్ల రూపాయలు వచ్చింది. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు 516 కోట్ల విరాళాలు అందాయి.