Tirumala : ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తొమ్మిది రోజులపాటు అత్యంత రమణీయంగా జరిగిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి.

Tirumala
Tirumala : తొమ్మిది రోజులపాటు అత్యంత రమణీయంగా జరిగిన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.. అనంతరం 8 గంటలకు ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజావరోహణం అంటే బ్రహ్మోత్సవాలకు వచ్చిన గరుడాళ్వార్ దేవతలను సాగనంపే కార్యక్రమం.
చదవండి : TTD : సాలకట్ల బ్రహ్మోత్సవాలు…చక్రస్నానం, శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ
తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్బంగా గరుడాళ్వార్ దేవతలను కోరతారు. ఈ ద్వహవరోహణ కార్యక్రమంలో గరుడ ధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపిస్తారు.
చదవండి : TTD : భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. త్వరలో సర్వదర్శనం టోకెన్లు