ఇసుకేస్తే రాలనంత జనం : తిరుమలలో ముక్కోటి ఏకాదశి శోభ

ఏకాదశి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. అందునా... వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని సేవించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 01:44 AM IST
ఇసుకేస్తే రాలనంత జనం : తిరుమలలో ముక్కోటి ఏకాదశి శోభ

Updated On : January 6, 2020 / 1:44 AM IST

ఏకాదశి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. అందునా… వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని సేవించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర

ఏకాదశి హిందువులకు ఎంతో ముఖ్యమైనది. అందునా… వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని సేవించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారని పురాణాలు చెబతున్నాయి. అందుకే ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు వైష్ణవాలయాలకు క్యూ కడతారు. ముఖ్యంగా తిరుమల జనసంద్రమవుతుంది. ఈసారి కూడా… ఇల వైకుంఠం భక్తుల తాకిడితో రద్దీగా మారింది.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. దక్షిణాయణంలో యోగ నిద్ర నుంచి మేల్కొన్న దేవదేవుడిని దర్శించుకోడానికి 33 కోట్ల దేవతలు వైకుంఠానికి చేరుకుంటారని, ఆ పుణ్యదినమే ముక్కోటి ఏకాదశి అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు ముక్కోటి దేవతలకూ దర్శనమిచ్చే శుభవేళ… తాము కూడా శ్రీహరిని దర్శించుకోవాలన్న కోరికతో భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. 

ఇప్పటికే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. నిన్నటి నుంచే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించడంతో క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ నిండిపోవడంతో నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లు, మాడవీధుల్లోని షెడ్లు, కల్యాణవేదిక ప్రాంగణంలో భక్తులు నిరీక్షిస్తున్నారు. మొత్తం లక్ష మందికిపైగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్నారు. అయితే… భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు నిలబడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అన్నప్రసాదాలు, అల్పాహారం, తాగునీరు, టీ, కాఫీ వంటి ఏర్పాట్లు చేశారు.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఈ ఉదయం స్వర్ణ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఆలయం ముందున్న స్వర్ణరథంలోకి వేంచేపు చేశారు. శాస్త్రోక్త కార్యక్రమాల తర్వాత 9 గంటలకు స్వర్ణరథం ఊరేగింపు ప్రారంభమవుతుంది. వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా వేకువజామున చక్రస్నానం నిర్వహించనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయానికి సాధారణ భక్తులతోపాటు ప్రముఖుల తాకిడి కూడా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పలువురు వీఐపీలు కొండకు చేరుకున్నారు. వీరితోపాటు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Also Read : 20ఏళ్ల తర్వాత కలిసిపోయారు.. అసలు చిరంజీవి, విజయశాంతి మధ్య ఏం జరిగింది?