తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం.. ఇక వారం రోజుల పాటు..

Tirupati Gangamma Jatara: అప్పటి వరకు గ్రామస్తులు ఊరిని విడిచి వెళ్లవద్దు. ఆ తర్వాతి రోజు తెల్లవారు..

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం.. ఇక వారం రోజుల పాటు..

Tirupati Gangamma Jatara 2024

తిరుపతి గంగమ్మ జాతర బుధవారం నుంచి వారం రోజులపాటు జరగనుంది. నిన్న రాత్రి చాటింపుతో జాతర ప్రారంభమైంది. కైకాల వంశస్తులు గత రాత్రి గ్రామంలో చాటింపు వేశారు. భేరి వీధిలో పూజ నిర్వహించారు. అలాగే, నగర శివారు ప్రాంతాల్లో అష్టదిగ్భంధనం చేశారు. ఈనెల 21 వరకు జాతర జరుగుతుంది. అప్పటి వరకు గ్రామస్తులు ఊరిని విడిచి వెళ్లవద్దు.

ఆ తర్వాతి రోజు తెల్లవారు జామున అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. చెంప నరికే కార్యక్రమంతో ఈ జాతర ముగుస్తుంది. రోజుకొక వేషంతో అమ్మవారిని భక్తులు దర్శించుకోనున్నారు. ఇవాళ భైరాగి వేషం ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.

వచ్చే మంగళవారం తిరుపతి జాతర ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా జాతర వారం రోజులపాటు వాయిదా పడి, ఇవాళ ప్రారంభమైంది. తిరుపతిలో ఈ జాతర వైభవంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రధాన జాతరలో ఈ జాతర ఒకటి.

తిరుపతి గంగమ్మ జాతరకు ఈ జాతరకు విశిష్టత ఉంది. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. తాతాయ్య గుంట గంగమ్మకు ప్రతి ఏడాది జాతర చేస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో వారం రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. గ్రామ దేవతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.

Also Read: తాడేపల్లిలో శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం