తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు, అందుకే- జగన్ హాట్ కామెంట్స్

బీజేపీ సహా పార్టీలన్నింటిని పిలిచి ఏపీలో పరిస్థితులను చూడమని చెప్పామని, ఇండియా కూటమి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు, అందుకే- జగన్ హాట్ కామెంట్స్

Ys Jagan Mohan Reddy : కాంగ్రెస్ పెద్దలతో ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తాము ఆధారాలతో సహా ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేశామని, అన్ని పార్టీలను ఆహ్వానించామని తెలిపారు. కాంగ్రెస్ ఎందుకు వైసీపీ నిరసనకు మద్దతివ్వలేదో ఆ పార్టీ నేతలనే అడగాలన్నారు జగన్. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ రాలేదని జగన్ కామెంట్ చేశారు.

చంద్రబాబు అంటే కాంగ్రెస్ కు ఎందుకు ఇష్టమో, చంద్రబాబు-కాంగ్రెస్ మధ్య సంబంధాలను కాంగ్రెస్ నేతలనే అడగాలన్నారు జగన్. బీజేపీ సహా పార్టీలన్నింటిని పిలిచి ఏపీలో పరిస్థితులను చూడమని చెప్పామని, ఇండియా కూటమి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం రాలేదన్నారు జగన్.

”రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ మీరే చూడండి. అవి చూసిన తర్వాతే మీరు న్యాయంవైపు, ధర్మంవైపున గళం విప్పండి అని అందరికీ రిక్వెస్ట్ చేశా. కొన్ని పార్టీలు వచ్చాయి. అందులో ఇండియా కూటమి పార్టీలు కొన్ని ఉన్నాయి. మిగతా పార్టీలు కూడా వచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో ఆ పార్టీనే అడగాలి. చంద్రబాబుకి, కాంగ్రెస్ కి ఉన్న సంబంధాలు ఏంటో కాంగ్రెస్ పార్టీనే అడగాలి. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీని అడగాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కళ్ల ముందే కనిపిస్తుంటే.. మణిపూర్ లో ఏమో ధ్వజమెత్తుతారు, అటువంటి దారుణాలు ఏపీలో జరుగుతుంటే మరి ఎందుకు వచ్చి మద్దతివ్వడం లేదు? కాంగ్రెస్ పార్టీనే అడగాలి. వాళ్లకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవ జరిగినా అడక్కపోవడం ధర్మమేనా? వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా? ఎవరైతే వచ్చి మనకు మద్దతిస్తారో, ఎవరైతే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద తోడుగా ఉంటారో కచ్చితంగా వాళ్లతో కలిసి పోరాటం చేస్తాం.

బీజేపీని పిలిచాము, కాంగ్రెస్ ని పిలిచాము, సమాజ్ వాదీ పార్టీని పిలిచాము, మమతా బెనర్జీని పిలిచాము. అందరినీ పిలిచాము. వచ్చిన వారందరిని కలుపుకుని, వచ్చిన వారందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం” అని జగన్ అన్నారు.

Also Read : షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?