తాడేపల్లిలో శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం

బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి..

తాడేపల్లిలో శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం

YS Jagan

Updated On : May 15, 2024 / 5:24 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నివాసంలో సీఎం వైఎస్ జగన్‌కు తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనం ఇచ్చారు వేద పండితులు.

YS Jagan

బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ శారదా రెడ్డి దంపతులు రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పడమట సురేశ్ బాబు సహకారంతో సహస్ర చండీయాగం నిర్వహించారు.

జగన్‌ ప్రజాహిత పాలన కొనసాగాలని, ఆయనకు విజయం చేకూరాలని ఆకాంక్షించారు. 41 రోజులపాటు రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించారు నల్లపెద్ది శివరామప్రసాదశర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మలు, తదితరులు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో పూర్ణాహుతికి ఉపయోగించే ద్రవ్యాలకు జగన్‌తో షోడషోపచార పూజలు చేయించారు.

Also Read: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు