ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు

Election Commission: పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు

Election Commission

Updated On : May 15, 2024 / 4:40 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఎన్నికల సంఘం సమన్లు పంపింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఈసీ ఆదేశించింది.

పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జవహర్ రెడ్డి, హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీకి రావాలని చెప్పింది. దీంతో గురువారం వారిద్దరు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్నారు. కాగా, పోలింగ్ కి కొన్ని రోజులు ముందే డీజీపీతో పాటు ఐజీ, ఎస్పీలను ఎన్నికల కమిషన్ మార్చిన విషయం తెలిసిందే. కాగా, ఏపీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా, ఇప్పటికే చంద్రగిరిలో 30 మందిని అరెస్ట్ చేశారని సీఈవో ఎంకే మీనా ఇవాళ మీడియాకు తెలిపారు. మిగిలిన నిందితులను ఇవాళ, రేపు అరెస్టు చేస్తారని చెప్పారు.

Also Read: విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపుతున్నారు.. కరెంటు కోతలను సరిదిద్దాలనే చిత్తశుద్ధి లేదా?: హరీశ్ రావు