అరకు లోయలో పడిన టూరిస్టు బస్సు, నలుగురు మృతి?

అరకు లోయలో పడిన టూరిస్టు బస్సు, నలుగురు మృతి?

Updated On : February 12, 2021 / 10:28 PM IST

Tourist bus crashes : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖలోని అరకులోయ హాహాకారాలతో దద్దరిల్లింది. చట్టూ చిమ్మ చీకటి, ఎమి అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. తీవ్రగాయాలతో కొందరు, విగతజీవులుగా ఆ ప్రాంతం మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారిలో తీవ్ర భయాందోళనలతో వణికిపోయారు. dineshtravelshyd ప్రాంతానికి చెందిన బస్సు అరకు లోయలో పడిపోయింది. అనంతగిరి డముక వద్ద లోయలో టూరిస్టు బస్సు బోల్తా కొట్టింది.

ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 24 మంది ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ పేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. గాయాలపాలైన వారిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 108 సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.