సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో అంబటి రాంబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్ గా హైకోర్టులో వాదనలు వినిపించారు.

సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో అంబటి రాంబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Ambati Rambabu

Updated On : January 6, 2025 / 4:44 PM IST

సోషల్ మీడియా పోస్టింగ్స్ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ వ్యవహారంలో పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు.

తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్ గా హైకోర్టులో వాదనలు వినిపించారు. పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో 5 కంప్లైంట్స్ ఇస్తే నాలుగు కేసులు మాత్రమే నమోదు చేశారనీ కోర్టుకు తెలిపారు. మరో కంప్లైంట్లో కేసు ఎందుకు నమోదు చేయలేదో అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

కాగా, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కించపరుస్తున్నారని అంబటి రాంబాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపైన, తన కుటుంబ సభ్యులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులకు వేర్వేరు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ, కేసులు నమోదు చేయలేదని అన్నారు.

KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుపై సస్పెన్స్..