KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుపై సస్పెన్స్..
జనవరి 8, 9వ తేదీల్లో ఇద్దరూ తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.

KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? లేదా? అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
కేటీఆర్ ను ఈడీ అధికారులు ఏం ప్రశ్నిస్తారు?
రేపటి విచారణకు కేటీఆర్ హాజరైతే కేసుకు సంబంధించి ఏయే ప్రశ్నలను అధికారులు సంధిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరుకాకపోతే ఆ దర్యాఫ్తు సంస్థ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనే ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇతర నిందితులు బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కంటే ముందే కేటీఆర్ ని ఈడీ ప్రశ్నించనుండటంతో అధికారులు ఎలాంటి వివరాలు ఆరా తియ్యనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

KTR
ఆ ఇద్దరినీ వదలని ఈడీ అధికారులు..
మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఎఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ వదలటం లేదు. ఈ కేసులో వీరిద్దరు తప్పక విచారణకు హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 8, 9వ తేదీల్లో ఇద్దరూ తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read : తెలంగాణ అప్పు తీర్చాలని రేవంత్ నాతో చర్చలు జరుపుదామన్నారు: కేఏ పాల్ కామెంట్స్
విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి..
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు డిసెంబర్ 28న నోటీసులు ఇచ్చింది. జనవరి 2 బీఎల్ఎన్ రెడ్డి, జనవరి 3న అరవింద్ కుమార్ లు హాజరవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు. విచారణకు మరింత సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేసు దర్యాఫ్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్ పంపారు.
అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకు హాజరు కాలేనని ఇటీవల ఈడీ అధికారులకు మెయిల్ పెట్టారు. ప్రస్తుతం విచారణకు రాలేనని, కొన్ని రోజులు సమయం కావాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు అరవింద్ కుమార్. బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విజ్ఞప్తులపై స్పందించిన ఈడీ అధికారులు.. ఈ నెల 8, 9 తేదీల్లో తదుపరి విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.
Also Read : ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక అంశాలను బయటపెట్టిన సర్కార్.. కేటీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్