Vishakapatnam : విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరి.. ఒకరితో ప్రేమ మరొకరితో రహస్య వివాహం, బాలిక.. యువకుడు ఆత్మహత్య
బాలిక సూర్య ప్రకాశ్ ను ప్రేమించి సాయి అనే వ్యక్తిని రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు. సూర్య ప్రకాశ్ కు విషయం తెలియడంతో బాలికను నిలదీశారు. మరోవైపు సూర్య ప్రకాశ్ ను వదలి తనతోనే ఉండాలని సాయి అనే యువకుడు బాలికను ఒత్తిడి చేశారు.

Triangle love story
Visakha Triangle Love Story : విశాఖలో ట్రయాంగిల్ లవ్ స్టోరి బేబీ సినిమా తలపించింది. బాలిక ఒకరితో ప్రేమ, మరొకరితో రహస్య వివాహం నడిపారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. రెండు రోజుల క్రితం ఉరి వేసుకుని బాలిక, రైలు కింద పడి యువకుడు ఆత్మహత్యకు చేసుకున్నారు. మరో యువకుడు అరెస్టు అయ్యారు.
బాలిక సూసైడ్ కేసులో మిస్టరీ వీడింది. బాలిక సూర్య ప్రకాశ్ ను ప్రేమించి సాయి అనే వ్యక్తిని రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు. సూర్య ప్రకాశ్ కు విషయం తెలియడంతో బాలికను నిలదీశారు. మరోవైపు సూర్య ప్రకాశ్ ను వదలి తనతోనే ఉండాలని సాయి అనే యువకుడు బాలికను ఒత్తిడి చేశారు. ఎవరితో ఉండాలో తెల్చుకోవాలని ఒత్తిడి తెవడంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నారు.
బాలిక తల్లిదండ్రులు సూర్య ప్రకాశ్, సాయిపై పిర్యాదు చేశారు. కాగా, పోలీసుల విచారణ భయంతో సూర్య ప్రకాశ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సాయి అనే మరో యువకుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.