Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..

శ్రీవారి మెట్టు నడక మార్గంలో 1200 మెట్టు వద్ద తమ ఆధార్ చూపించి స్కానింగ్ చేయించుకోవాలని టీటీడీ సూచించింది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..

Updated On : June 4, 2025 / 1:00 AM IST

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి మెట్టు వద్ద జారీ చేసే దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్ ను మూసివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. దివ్య దర్శనం టోకెన్ల జారీ కౌంటర్ ను అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు మార్చినట్లు టీటీడీ తెలిపింది.

అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ కౌంటర్ ను తాత్కాలికంగా ఏర్పాటు చేయనుంది టీటీడీ. 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్ కౌంటర్ అందుబాటులోకి రానుంది. భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టు నడక మార్గంలో 1200 మెట్టు వద్ద తమ ఆధార్ చూపించి స్కానింగ్ చేయించుకోవాలని టీటీడీ సూచించింది. 7వ తేదీ దర్శనం కోసం 6వ తేదీ సాయంత్రం నుండి టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ.