Heart Attack: వచ్చే నెలలో వివాహం.. ఇంతలోనే మృతి.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం..

టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కొడుకు చంద్రమౌళి (28) మరణించాడు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు.

Heart Attack: వచ్చే నెలలో వివాహం.. ఇంతలోనే మృతి.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం..

TTD EO SON

Updated On : December 21, 2022 / 10:41 AM IST

Heart Attack: టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కొడుకు చంద్రమౌళి (28) మరణించాడు. ఆదివారం మధ్యాహ్నం చంద్రమౌళికి గుండెపోటు రావడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, వైద్యులు పలు విధాలుగా చికిత్స అందించినప్పటికీ చంద్రమౌళి ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూనే బుధవారం మరణించాడు. ఆయన మృతిని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

TTD EO Dharma Reddy Relief in HC : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట..సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజనల్ బెంచ్

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి. ఇటీవల వివాహంకూడా నిశ్చయమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో జనవరిలో తిరుమల తిరుపతిలో వీరి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి తేదీసైతం నిశ్చయం కావడంతో ఇరు కుటుంబాల వారు బంధువులు, మిత్రులకు శుభలేఖలు ఇచ్చే పనిలో మిగ్నమయ్యారు. ఈ క్రమంలో చంద్రమౌళి చెన్నైలోని తన బంధువులకు వివాహ ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి ఆదివారం కారులో తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో అతనికి గుండెపోటు రావటంతో స్నేహితుడు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు.

TTD EO Dharma Reddy : టీటీడీ ఈఓ ధర్మారెడ్డి‎కి నెల రోజులు జైలు శిక్ష

వైద్యులు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. ఎక్మో సహా ఇతర చికిత్సలుసైతం అందించారు. అయినా ఫలితం లేకపోయింది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన కొడుకు మరణించడంతో ధర్మారెడ్డి, ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.