TTD EO Dharma Reddy Relief in HC : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట..సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజనల్ బెంచ్

కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట..సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది డివిజనల్ బెంచ్.

TTD EO Dharma Reddy Relief in HC : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట..సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజనల్ బెంచ్

TTD EO Dharma reddy big relief in andhra pradesh high court

Updated On : December 16, 2022 / 1:00 PM IST

TTD EO Dharma Reddy Relief in HC  : కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజినల్ బెంచ్ తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శుక్రవారం (డిసెంబర్ 16,2022) దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన డివిజినల్ బెంచ్ కొట్టివేసింది. తీర్పును సస్పెండ్ చేసింది. ఈవో ధర్మారావుకు సింగిల్ బెంచ్ నెల రోజులు జైలుశిక్ష,రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ ఆదేశాలను డివిజినల్ సస్పెండ్ చేసింది.

కాగా కొన్నాళ్ల క్రితం టీటీడీకి చెందిన ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు సర్వీస్ క్రమబద్దీకరణ విషయంలో తమకు న్యాయం చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సింగిల్ బెంచ్ సదరు ఉద్యోగులను క్రమబద్దీకించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో సింగిల్ బెంచ్ ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కింద నెల రోజులు జైలు..రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దర్మారెడ్డి పిటీషన్ వేయగా డివిజినల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ధర్మారెడ్డికి ఊరట కలిగింది.